చేనేత కార్మికుల కోసం సీఎం జగన్ కొత్త పథకం...

Suma Kallamadi

ఏపీలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలనలో ప్రజలకు అందిస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనులు, భూగర్భ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలియచేయడం జరిగింది. తాజాగా కృష్ణ జిల్లాలో   పెడనలో వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని), పెడన ఎమ్మెల్యే జోగి రమేష్‌ కలెక్టర్‌ ఇంతియాజ్‌తో అందరు కలిసి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా జ్యోతి ప్రజ్వలన చేయడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. చేనేత కార్మికులకు సంక్షేమం, వారు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఏటా ప్రభుత్వం వారి ఖాతాల్లో రూ.24 వేల చొప్పున జమ చేయడం జరుగుతుంది అని పెద్దిరెడ్డి తెలియచేయడం జరిగింది. ఇప్పటి వరుకు ఏ ప్రభుత్వం కూడా ఇలా  నేత కార్మికులకు సాయం చేసింది లేదు అని తెలియచేయడం జరిగింది. ఇక జిల్లాలో 4,270 మందికి చేనేతలకు రూ.10.24 కోట్లు ఇవ్వబోతున్నట్లు స్పష్టంగా తెలియచేయడం జరిగింది.

 


ఇలా ముద్ర యోజన రుణం ద్వారా ఏడు శాతం వడ్డీ రాయితీతో రూ.లక్ష మాత్రమే ఇస్తూ ఉండేవారు, ఇదే రాయితీతో రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు ఇవ్వాలి అనే ముఖ్యమంత్రి నేత కార్మికుల కోసం అవకాశం ఇస్తున్నారు అని తెలియచేయడం జరిగింది. ఇక మన రాష్ట్రంలో  ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఎదురుకున్న సరే  నవరత్నాలలోని పథకాలను మాత్రం తప్పకుండా అమలు చేయడం జరుగుతుంది అని తెలిపారు. ఇప్పటి వరుకు 80 శాతం హామీలు అమలు కూడా  చేయడం పూర్తి అయ్యింది అని తెలిపారు.

 

ఇక మరో వైపు రాష్ట్ర రవాణా, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)  మాట్లాడుతూ...నేత కార్మికులు ఆత్మగౌరవంతోనే జీవనం కొనసాగించాలి అని, వారికి పనులు లేకపోయినా పస్తులుంటారే తప్ప ఎప్పుడు కూడా చేయి చాచిన దాఖలాలు లేవని తెలియచేయడం జరిగింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: